కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:
- సీటు కేటాయింపుపై వైసీపీ నేతల్లో ఆందోళన.
- ఎన్నికల వ్యయం భరించే వారినే అభ్యర్ధులుగా ఎంపిక చేస్తారా?
- సిట్టింగులకే మరో అవకాశం ఇవ్వబోతున్నారా?
వైకాపా నేతల్లో సీట్ల కేటాయింపుపై ఆందోళన పట్టుకుంది.నియోజక వర్గ సమన్వయకర్తలుగా తమ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న నేతలకు ఆఖరి నిమిషంలో సీటు మారుతుందేమోనన్న భయం పట్టుకుంది.కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పోటిపై అధినేత జగన్ అధికారికంగా ఎవ్వరిని ఇప్పటి వరకు ప్రకటించలేదు.కానీ తమకే సీటు గ్యారంటీ అనే విశ్వాసంతో పలువురు ప్రచారం ముమ్మరం చేశారు.కానీ ప్రధానంగా ఎన్నికల వ్యయం భరించే వారినే అభ్యర్దులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతుంది.సిట్టింగ్‌లకే మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.

No comments:
Post a Comment