కర్నూలు న్యూస్‌టుడే:
*నిబం ధనలు ఉల్లంఘిస్తే కేసులు..
స్వేచ్ఛాయుత వాతావరణంలో సాధారణ ఎన్నికల నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం ఉండవల్లి నుంచి ఎంసీసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, శాంతిభద్రతలు, ఎంసీఎంసీ తదితర ఎన్నికల నిర్వహణ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై నియమావళి మేరకు కేసులు నమోదు చేయాలన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నియావళి ఉల్లంఘనలపై సి.విజిల్ యాప్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. జిల్లాలో ఎంసీఎంసీ, ఎంసీసీ, సి.విజిల్ తదితర కమిటీలు సమర్థంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు నివేదించారు. 1950 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా 8500 కాల్స్‌ను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. 339 వీవీప్యాట్స్, 75 కంట్రోల్ యూనిట్లు ఇంకా రావాల్సి ఉందని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా తరలించే రూ.3.34 కోట్ల నగదును సీజ్ చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఏఆర్వో ప్రశాంతి, డీఆర్వో వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment