న్యూస్‌టుడే:ప్రధాని మోదీ విశాఖ పర్యటనను నిరసిస్తూ ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలో టీడీపీతో పాటూ పలు పార్టీల నేతలు నిరసనను తెలియజేశారు. రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్‌లో కార్యకర్తలు నల్ల చొక్కాలు, జెండాలతో నిరసనలు తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.రైల్వే జోన్ పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆదాయం లేని రైల్వే జోన్ ఏపీకి ఇవ్వడమేంటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజల హక్కుల సాధన కోసం ధర్మపోరాట నిరసన చేస్తున్నామని.. ప్రజలకు నమ్మక ద్రోహం చేసి విభజన గాయాలపై కారం చల్లేందుకే ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు.
No comments:
Post a Comment