తెలుగులో ఇప్పుడి కీర్తి సురేశ్ అగ్రకథానాయికగా కొనసాగుతోంది.తమిళంలో ను ఆమె అదే హోదాలో తన జోరు చూపుతోంది.ఈ మధ్యకాలంలో తమిళంలో వరుసబెట్టి విజయాలను సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలోనే తాజాగా ఆమె ఒక హిందీ సినిమాను అంగీకరించినట్టుగా కోలీవుడ్ టాక్.ఇంతకుముందు హిందీలో ‘బధాయి హో ‘ తో హిట్ కొట్టేసిన అమిత్ శర్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడట. ఈ సినిమాను బోనీకపూర్ నిర్మించనున్నట్టు సమాచారం. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ,చాలా మది కధానాయికల పేర్లను పరిశీలించారట.చివరికి కీర్తి సురేశ్ అయితే బాగుంటుందని భవించి ఆమెను సంప్రదించడం ..ఆమె ఓకే చేయడం జరిగిపోయిందని అంటున్నారు.ఈ సినిమాలో తన రోల్ చాలెంజింగ్ గా ఉండటంతోనే కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

No comments:
Post a Comment