Monday, March 11, 2019

విద్యార్థుల కోసం”గైర్వాణీ ఙ్ఞాన యఙ్ఞం”


విజయనగరం న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
*మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాలలో మాహాయఙ్ఞం
* విద్యార్థులకు సరస్వతీ మాత కరుణ కటాక్షం కోసం కళాశాలలో గైర్వాణీ ఙ్ఞాన యఙ్ఞం.
పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులందరికి సరస్వతీ మాత కరుణ కటాక్షం సిద్ధించాలంటూ కళాశాలలో గైర్వాణీ ఙ్ఞాన యఙ్ఞం నిర్వహించారు.వివరాలు……సోమవారం మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాలలో విద్యార్థుల కోసం గైర్వాణీ ఙ్ఞాన యఙ్ఞం నిర్వహించారు. ఈ యఙ్ఙం రుగ్వేద,యజుర్వేద పండితుల రామభట్ల సన్యాసిరాజుశర్మ.అల్లం రాజు సూర్యరాజేశ్వరశర్మ మంత్ర ఉచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమీటి సభ్యులు పి.వి.నర్సింహారాజు,డాక్టర్ జి.ఎ.కళ్యాణి,చెరుకూరి శ్రీధర్,మేక కాశీవిశ్వేశ్వరుడు, శ్రీవేంకటేశ్వర ధవళ సర్వేశ్వర్రవు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment