గోవా న్యూస్‌టుడే:
*ఈ బాద్యతలను ఇచ్చినందుకు ధన్యవాదాలు
*ఆయన మార్గంలోనే నడవాలని ఆకాంక్ష.
గోవా నూతన ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి మనీహార్ పారికర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.”పారికర్ భౌతికంగా మన మధ్య లేరు. ఈ నేపథ్యంలో పార్టీ, సంకీర్ణ పక్షాలు,స్వతంత్ర ఎమ్మెల్యేలు నాపై పెద్ద బాద్యతని ఉంచారు. మనోహార్ పారికర్ గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి.సామాజికంగా వెనకబడిన వర్గాలు, యువత కోసం పారికర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని సావంత్ గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సీఎంగా సావంత్ బాధ్యతలు చేపడుతున్న సమయంలో ఆయన భార్య, గోవా భాజపా మహిళా విభాగం అధ్యక్షురాలు సులక్షణ సావంత్.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ప్రమోద్‌కు సీఎం బాధ్యతలు అప్పగించడంపై ఆమె భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు. పారికర్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment