Monday, March 18, 2019

అభిమానులు నాకు ధైర్యం చెప్పారు..ప్రెండ్స్ ప్రోత్సాహం తో ముందడుగు వేస్తున్నా: సుమలత

తాను రాజకీయాల్లోకి వెళ్లడమే సరైన నిర్ణయమని రజనీకాంత్, చిరంజీవి తనకు సూచించారని ప్రముఖ సినీనటి, దివంగత అంబరీష్ భార్య సుమలత తెలిపారు. వారి సూచన మేరకే తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నానని చెప్పారు. అయితే, తన తరపున వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, లేదా అనే విషయం మాత్రం ఇంత వరకు చర్చకు రాలేదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ, మాండ్య ప్రజల అభిమానంతోనే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. అంబరీష్ మరణాన్ని ఇప్పటికీ తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అంబరీష్ లేని జీవితం శూన్యమని తాను భావించానని… కానీ, నిరాశలో ఉన్న తనకు అభిమానులు ధైర్యాన్ని ఇచ్చారని, ప్రజా జీవితంలో ఉండాలని సూచించారని చెప్పారు.

No comments:

Post a Comment