Monday, March 18, 2019

తప్పు చేసి బెదిరింపు…………..

కాకినాడ  కలెక్టరేట్,   న్యూస్‌టుడే  :ముఖ్యంశాలు:
*ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబరు 1800 4254868తో కంట్రోల్‌ రూమ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 సార్వత్రిక ఎన్నికల్లో మద్యం ప్రభావాన్ని నియంత్రించడానికి ఏపీ మద్య నిషేధ, అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడప్రతి ప్రచార చిత్రాలు, కర పత్రాలను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆవిష్కరించారు. వీటి ద్వారా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఉప కమిషనర్‌ బి.అరుణరావు మాట్లాడుతూ ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబరు 1800 4254868తో కంట్రోల్‌ రూమ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన్నప్పట్నుంచి 400 కేసులు నమోదు చేసి, 312 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 58 మద్యం గొలుసు దుకాణాలను తొలగించినట్లు తెలిపారు. రూ.85 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈకార్యక్రమంలో సహాయ కమిషనర్‌ ఎం.జయరాజు, కాకినాడ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి.రామచంద్రరావు, ఇన్‌స్పెక్టర్లు ఏవీ చలం, పి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments:

Post a Comment