విజయనగరం న్యూస్‌టుడే:
- పార్టీ కార్యకర్తల సమావేశం….
- గిరిజనులంతా సమైక్యంగా ఉండి ఓటు అనే ఆయుధంతో వీరికి బుద్ధి చెప్పాలి…
గిరిజనలహక్కులను హరింజే జమిందారీ కుటుంబీకులను ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణామూర్తి పిలుపునిచ్చారు.సుక్రవారం మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ కార్యకర్తలను సమావేశంలో ఆయన మాట్లాడారు.స్వతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు రాజు కుటుంబీకులు గిరిజనులుగా చలామణి అవుతూ, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారని అన్నారు. కురుపాం, మేరంగి, సాలూరు జమీందారి కుటుంబాలు గిరిజనులుగానే కొనసాగుతూ, పదవులను అనుభవిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు ఈ జమీందారులకే టికెట్లు కేటాయిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై పెత్తనం వీరిదేనని, రెవెన్యూ యంత్రాంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నారని విమర్శించారు.
గిరిజనులంతా సమైక్యంగా ఉండి ఓటు అనే ఆయుధంతో వీరికి బుద్ధి చెప్పి, రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. హక్కుల కోసం ఆదివాసీలు ఆయుధం పట్టనక్కర్లేదని, జమీందారి కుటుంబాలను ఓడిస్తే చాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా (పార్వతీపురం) కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి, నాయకులు మండంగి శ్రీనివాసరావు, బిడ్డిక చామంతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలక అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment