కడప న్యూస్‌టుడే:
- అక్రమంగా తరలిస్తున్న చీరలను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- 24లక్షలు విలువ చేసే 1550 చీరలు, రూ. 2లక్షలు నగదును స్వాధీనం.
కొత్తపేట సర్కిల్ వద్ద రూరల్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న చీరలను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.గురువారం జమ్మలమడుగు నుండి ప్రొద్దుటూరు వైపునకు వస్తున్న రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారంలేని రూ. 24లక్షలు విలువ చేసే 1550 చీరలు, రూ. 2లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాము రవాణా చేసే వస్తువులకు సంబంధించిన చట్టబద్ధమైన బిల్లులు, ఆధారాలు వెంట ఉంచుకోవాలన్నారు. లేని పక్షంలో అక్రమ రవాణాగా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
No comments:
Post a Comment