బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితమైన నటి శిల్పా శెట్టి. షారుక్ ‘బాజిగర్’ సినిమాతో 1993లో హిందీ ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమా విజయం సాధించింది. తెలుగులో ‘సాహస వీరుడు సాగర కన్య’, ‘వీడెవడండీ బాబూ’, ‘ఆజాద్’ తదితర చిత్రాల్లో ఆమె సందడి చేశారు. అయితే హిట్లు వచ్చినప్పటికీ అవార్డులు రాకపోవడం గురించి తాజాగా శిల్పా మీడియాతో మాట్లాడారు. ప్రజలు తనను నటిగా తిరస్కరించిన భావన కల్గించిందని అన్నారు.నటిగా నా బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నానని ప్రతిసారీ అనుకునేదాన్ని. నాది కష్టపడేతత్వం. నా పాత సినిమాలు చూసినప్పుడు సోఫా కింద దాక్కునేదాన్ని. నాకు అవకాశాలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోయేదాన్ని. ఇదంతా విధి. అపజయాలు చవి చూడకుండా విజయం సాధించిన వ్యక్తులు ఎవరూ లేరు.

No comments:
Post a Comment