కడప న్యూస్‌టుడే :
జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబునాయుడుతో కలిసి ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెదేపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే పవన్‌కల్యాణ్ అజెండాగా కనిపిస్తోందన్నారు. వైకాపాను విమర్శించడమే పవన్‌కల్యాణ్ లక్ష్యంగా చేసుకొన్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేకహోదాను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టుపెట్టారన్నారు. వైకాపా రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, కార్యదర్శి బలరాం, నాయకులు మల్లికార్జునకిరణ్, దాసరిశివప్రసాద్, కొండయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
No comments:
Post a Comment