కడప జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే :ముఖ్యంశాలు…..
- కడప చరిత్రను మార్చేస్తా……
జిల్లాను సస్యశ్యామలం చేయడంతోపాటు ఉద్యాన, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు తీసుకువచ్చి కడపను మారుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడపలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ కడపలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్రం స్పందించకపోయినా తానే ముందుండి శంకుస్థాపన చేశానని, ప్రస్తుతం నివేదికలు తయారవుతున్నాయన్నారు. పనులు మొదలై ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కడప దర్గాను అభివృద్ధి చేసి పర్యాటకంగా మార్పు చేస్తానని, గండికోటను ఇదివరకే పర్యాటకంగా తీర్చిదిద్దామని ఇప్పటికే ఉత్సవాలు కూడా చేశామన్నారు. ఒంటిమిట్టను రెండో భద్రాద్రిగా మార్పుచేసి భద్రాచలం కంటే మెరుగైన రీతిలో అద్భుతంగా తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఆది నుంచి జెండాలు మోసింది మీరేనని ఎన్ని కష్టాలు ఎదురైనా ముఠా కక్షలు పొట్టునపెట్టుకున్నా భుజాలు అరిగేలా తిరిగారన్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.యుద్ధానికి వెళ్లే వీరసైనికులు కార్యకర్తలేనని, తన వద్ద 65 లక్షల మంది పసుపు సైన్యం ఉందని.. ప్రతి సైనికుడు ఓ చంద్రబాబేనన్నారు. దేవుని గడప వద్ద చెబుతున్నానని 40 ఏళ్ల రాజకీయ జీవిత చర్రితతో ఎంతో సంతృప్తి లభించిందన్నారు. పింఛన్లు, అన్నదాత సుఖీభవ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చానన్నారు.
No comments:
Post a Comment