శ్రీకాకుళం న్యూస్ టుడే:
తమ ప్రమేయం లేకుండానే తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని అంతర్జాలంలో దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని అన్నుపురం, కిన్నెరవాడ గ్రామాలకు చెందిన పలువురు తహసీల్దారు కార్యాలయంతో పాటు పోలీస్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మండలంలో మొదటి విడతలో 474, రెండో విడతలో 45 మంది పేర్లు తొలగించాలని కోరుతూ అంతర్జాలంలో రహస్యంగా దరఖాస్తు చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఓటర్లు స్పందించారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ, మండలానికి పోలీస్‌శాఖకు చెందిన ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ (ఐటీ కోర్) సిబ్బందిని కేటాయించారు. ఈ మేరకు ఐటీ సిబ్బంది, ఎస్.ఐ. ఇ.శ్రీనివాస్ సంయుక్తంగా బుధవారం దర్యాప్తు ప్రారంభించారు.

No comments:
Post a Comment