Tuesday, March 19, 2019

కుప్పకూలిన భవనం….


బెంగూళూరు న్యూస్‌టుడే: 
*కర్ణాటకలోని కమలేశ్వర్‌నగర్‌లో ఘటన.
* శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు అంచనా.
కర్ణాటకలోని ధార్వాడ్ కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో  ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.భవనం  శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ,ఘటానస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఒకటి రెండు అంతస్తుల్లో నిర్మాణం పూర్తయి ఇప్పటికే పలువురు అద్దెకు ఉంటున్నారు. నాలుగో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగ ప్రమాదవశాత్తు భవనం ఒక్కసారిగా కూలిపోయింది.దీంతో దాదాపు వంద మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

No comments:

Post a Comment