Tuesday, March 19, 2019

జనసేన నాలుగో జాబితా.. బరిలో జేడీ లక్ష్మీనారాయణ


విశాఖజిల్లా: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* మూడో జాబితా విడుదల చేసిన జనసేన పార్టీ…
* లక్ష్మీనారాయణ తోడల్లుడును కమిటీకి చైర్మన్‌గా నియమించుట…
సోమవారం అర్ధరాత్రి దాటాక మూడో జాబితా విడుదల చేసిన జనసేన పార్టీ.. మంగళవారం మరో జాబితాను ప్రకటించింది. ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణకు విశాఖ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు కూడా పవన్ అభ్యర్థులను ఖరారు చేశారు. విశాఖపట్నం ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, విశాఖ దక్షిణం నుంచి గంపల గిరిధిర్ బరిలో ఉంటారని జనసేన తెలిపింది. భీమిలీ నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి (బాబు) పోటీ చేస్తారు. పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్ బరిలో దిగనున్నారు. లక్ష్మీనారాయణ తోడల్లుడు విశ్వవిద్యాయాలకు కులపతిగా పని చేసిన రాజగోపాల్‌కి పార్టీలో ఉన్నతమైన ఓ కమిటీకి చైర్మన్‌గా నియమించనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.

No comments:

Post a Comment