Wednesday, March 13, 2019

ప్రియాంక చోప్రాకి భర్త గిప్ట్ ఏంటి ….?

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన అందాల భామ ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్‌ని చూసి తెగ మురిసిపోయింది. త‌న భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ. త‌న భ‌ర్త ఉత్త‌మ భ‌ర్త అని చెబుతూ ఐల‌వ్ యూ బేబీ అనే కామెంట్ పెట్టింది. వివ‌రాల‌లోకి వెళితే ఇటీవ‌ల నిక్ జోనాస్ బ్ర‌ద‌ర్ సుకర్ రూపొందించిన వీడియో సాంగ్‌లో నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా క‌లిసి ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. జోనాస్ బ్ర‌ద‌ర్స్( జో, కెవిన్‌, నిక్‌) వారి వైఫ్స్( సోఫీ, డానియెల్‌, ప్రియాంక‌) కాంబినేష‌న్‌లో రూపొందిన ఆల్బ‌మ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అపూర్వ ఆద‌ర‌ణ ఈ వీడియోకి రావ‌డంతో నిక్ జోనాస్ తన స‌తీమ‌ణి ప్రియాంక చోప్రాకి రూ.2.7 కోట్లతో మేబాచ్ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును కొని దాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ కారుతో పాటు వారిద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోల‌ని ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి వైర‌ల్ అయ్యాయి.

No comments:

Post a Comment