శ్రీకాకుళం(నివగాం)న్యూస్‌టుడే:
1)నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు…….
2)విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలి….
3)పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు……
2)విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలి….
3)పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు……
జిల్లాలో పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడా మాస్‌కాపీయింగ్‌కు తావీయకుండా నిఘా పెంచాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. పదోతరగతి పరీక్షలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని, వేసవి తీవ్రత పెరుగుతున్నందున ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్తు, వైద్యం, రవాణా తదితదర సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తడికి గురయ్యే అవకాశం ఉన్నందున ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చన్నారు. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ-2 పి.రజనీకాంతరావు, డీఈవో ఎం.సాయిరాం, డీఎంహెచ్‌వో డా.చెంచయ్య, డా. కృష్ణమోహన్, ఆర్టీసీ సీటీఎం డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment