గుంటూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
* సామాజిక న్యాయము తెదేపా అభ్యర్థుల ఎంపికలో వున్నది.
*కుట్రలపై జాగ్రత్తగా ఉంటూ మనం ఎన్నికలను చూసుకోవాలి.
కుటుంబ పెద్దగా అందరికి న్యాయం చేసే బాధ్యత నాదీ అని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ…. పని చేసిన వారితో పాటు సామాజిక న్యాయము తెదేపా అభ్యర్థుల ఎంపికలో ఉందన్నారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని నేను చెబితే అర్థం చేసుకుంటున్నామన్నారు. పార్టీ కోసం పని చేస్తామని కొందరు స్పూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తామన్నారు. కుట్రలపై జాగర్తగా ఉంటూనే మనం ఎన్నికలను చూసుకోవాలన్నారు. విభజన నాటి పరిస్థితులు నేటి పరిస్థితులను అంచనా వేసి ప్రజలు తీర్పు
ఇవ్వబోతున్నారన్నారు.

No comments:
Post a Comment