విశాఖ, వన్‌టౌన్, న్యూస్‌టుడే:
- రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ దక్షిణ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ సోమవారం సాయంత్రం కలిశారు.
- దక్షిణ నియోజకవర్గం నుంచి తనకు మరోసారి పార్టీ టిక్కెట్ లభించిందని, ఇందుకు సహకరించిన మంత్రి గంటాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నుంచే ప్రారంభించానని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, తెదేపా అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వాసుపల్లి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

No comments:
Post a Comment