Tuesday, March 12, 2019

పరిశ్రమలు భాగస్వామ్యం కావాలి…………


శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
  • 1)టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
  • 2)పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం…..  
  • 3)కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం….. 
ఓటరు చైతన్య కార్యక్రమాల్లో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలని సంయుక్త కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని.ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు,కార్మికుల్లో ఓటరుగా నమోదు కానివారు నమోదు చేయించాలన్నారు.ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ఉన్నందున ఆ రోజు పరిశ్రమలకు సెలవు ప్రకటించాలన్నారు. నాగార్జున అగ్రికమ్‌ సంస్థ ఉపాధ్యక్షుడు సి.వి.రాజు మాట్లాడుతూ తమ పరిశ్రమ పరిధిలోని రెండు కేంద్రాలు ఉన్నాయని.వాటిని ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ బి.గోపాలకృష్ణ, ఉపసంచాలకులు గణపతి, కర్మాగారాల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment