- సుమారు ఆరేళ్ల తరువాత వైద్యశాఖలో రెగ్యులర్ ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- దీని ప్రకారం జిల్లాలో ఉన్న 99 రెగ్యులర్ పోస్టులకు ఫిబ్రవరి రెండో తేదీన ప్రకటన జారీ చేశారు.
- ఎలాంటి ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలు లేకుండా కేవలం మార్కులు ఆధారంగా ‘మెరిట్ కం రోస్టర్’ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆదేశాలిచ్చారు.
- దీని కోసం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేశారు.
వైద్యశాఖ కార్యాలయంలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 99 పోస్టులకు గాను సుమారు 2,491 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం మెరిట్ జాబితా ప్రకటించారు. ఈ నెల 11లోగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమన్నారు. 13న పునఃపరిశీలన చేసి, 15న తుది జాబితా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే మెరిట్ జాబితాపై కొంతమంది అభ్యంతరం చెబుతూ కోర్టును ఆశ్రయించారు.దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆ శాఖలో పనిచేసే నమ్మకస్తులను మధ్యవర్తులుగా పెట్టుకొని పోస్టు గ్యారంటీగా వచ్చే వారిని ముగ్గులోకి లాగారు. మీకు పోస్టు రావాలంటే కొంత అడ్వాన్సుగానూ, పోస్టు వచ్చాక మరికొంత సమర్పించుకునేలా పథకాన్ని అమలు చేశారు. దీంతో పోస్టు వస్తుందో రాదోనన్న ఆందోళనతో ఉన్నవారు అడిగిన మేరకు సమర్పించుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష వరకు రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.50 లక్షలు చేతులు మారినట్లు సమాచారంప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలకు విద్యార్హతతోపాటు, వారు పనిచేసిన కాలానికి ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇచ్చారు. అయితే కొందరు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఏఎన్‌ఎం కోర్సు చదివి ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికి కూడా పోస్టుల్లో వెయిటేజీ మార్కులు కల్పించారు.పల్స్ పోలియో సందర్భంగా ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు.
No comments:
Post a Comment