Sunday, March 10, 2019

కళ్లెదుటే కూతురి మృతితో తల్లడిల్లిన తల్లి గుండె….


టీఆర్‌రాజుపేట న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …
2.కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు…
3.కారు రూపంలో కబళించిన మృత్యువు..
తల్లిదండ్రుల గారాల బిడ్డ అయిన ఆ చిన్నారి ఇంటికి సమీపంలో ఉన్న సిమెంటు రహదారి పక్కన నిలుచొని ప్రధాన రహదారిలో వెళ్తున్న వాహనాలను చూస్తోంది.. అయితే అలా చూస్తున్న ఆమెను కారు రూపంలో మృత్యువు కబళించనుందని ఆ తల్లి అనుకోలేదు. ఓ కారు ఆ బాలికను బలంగా ఢీకొంది..  ఆ చిన్నారి ఎగిరిపడి సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది.టీఆర్‌రాజుపేట గ్రామంలో పీరుకట్ల రామినాయుడు, విజయలక్ష్మి దంపతులు కుమారుడు ధనుష్‌(8), కుమార్తె భవాని(6)లతో పాటు నివసిస్తున్నారు. ఆయన ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఆమె రోజు కూలి పనులకు వెళ్తోంది.ఈ ప్రమాద సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న స్థానిక ఎస్సై జి.భాస్కరరావు, సిబ్బంది చిన్నారి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి శవ పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
           

No comments:

Post a Comment