Monday, March 18, 2019

రిలీజ్ డేటు మార్చిన వర్మ…..


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల మరోమారు వాయిదా పడింది. ఎన్నికల ముందు సినిమా విడుదలను ఒప్పుకునేది లేదని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ కోర్టు కెళ్తానని ప్రకటించాడు. ఏది ఏమైనా మార్చి 22న సినిమాను విడుదల చేసి తీరుతానని ప్రకటించాడు.
అయితే,  ఆ తర్వాత కాసేపటికే సెన్సార్ బోర్డుతో నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని వర్మ ప్రకటించాడు. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. అయితే, సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 22న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చిన వర్మ 29న విడుదల చేయాలని నిర్ణయించాడు.

No comments:

Post a Comment