Monday, March 18, 2019

జిల్లాకు చేరిన కేంద్ర పోలీసు బలగాలు…

గుంటూరు: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* ఎన్నికల నియమావళి అమలుకు……
* ద్విచక్ర వాహనాలనూ వదలకుండా తనిఖీలు…..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవటంతో జిల్లా పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. జిల్లాల్లో  ప్రతి ఒక్కరి కదిలికలనూ అధికారుల ప్రకటన, ప్రచార జోరు ఊపందుకుంటుండగా మరోవైపు అధికారులు ఎన్నికల నియమావళిని అమలు చేయటానికి రంగంలోకి దిగారు. ఎన్నికల నియమావళి అమలుకు ఏర్పాటు చేసిన వివిధ రకాల బృంధాలు కట్టు తప్పే అభ్యర్ధులు, పార్టీల కార్యకర్తల కోసం మాటు వేశాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి కలిగి ఉన్న వ్యక్తుల నుంచి నగదు సీజ్ చేస్తున్నారు. వాస్తవంగా షడ్యూల్ విడుదలైన తరువాత నుంచి మొదటి రెండు మూడు రోజుల్లో తనిఖీలు విషయంలో జిల్లా వెనుకబడింది. ఎన్నికల కమిషన్ నుండి విమర్శలు రావటంతో వెంటనే ఎన్నికల నియమావళి అమలు  కమిటీలు ఏర్పాటు చేసి రంగంలో దిగారు. ద్విచక్ర వాహనాలనూ వదలకుండా తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు తమదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారు. నేర చరిత్ర కలిగిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుంచి పోలీస్ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి.

No comments:

Post a Comment