Monday, March 11, 2019

కోవా కజ్జికాయ…

కావలసిన పదార్థాలు:-
  • మైదాపిండి – అరకిలో,
  • పంచదార – కిలో,
  • పాలకోవా – పావుకిలో,
  • జాపత్రి – 2 గ్రాములు,
  • యాలకులు – 2 గ్రాములు,
  • శనగపిండి – 50 గ్రాములు,
  • వంట సోడా – పావు స్పూను,
  • బేకింగ్ పౌడర్ – పావుస్పూను,
  • నెయ్యి – 100 గ్రాములు,
  • రిఫైన్డ్ ఆయిల్ – తగినంత.
తయారు చేసే పద్ధతి:-
ఇండియన్ స్వీట్లలో కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం.

No comments:

Post a Comment