చింతూరు, న్యూస్‌టుడే :ముఖ్యంశాలు:
*పెట్రో ల్ బంకులో రూ.11 లక్షల చోరీ.
.
చట్టీలోని పెట్రోల్ బంకు(రాజా ఫ్యూయల్ స్టేషన్)లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బంకులోని దాదాపు రూ.11 లక్షలు ఎత్తికెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శని, ఆదివారాల్లో పెట్రోల్ విక్రయించగా వచ్చిన నగదు బంకులోని ఇనుప పెట్టిలోనే ఉంచేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని వ్యక్తులు బంకు గదిలోకి ప్రవేశించి పెట్టెను పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. బంకులోని సీసీ కెమెరాలను పగులగొట్టి, కంప్యూటర్‌లోని హార్డు డిస్క్‌ను సైతం పట్టుకెళ్లారు. ప్రత్యేకంగా క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను, ఆనవాళ్లను సేకరించారు. చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ ఆధ్వర్యంలో చింతూరు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై శ్రీనివాసకుమార్ సమీక్షించారు.

No comments:
Post a Comment