Sunday, March 17, 2019

సుజనా గ్రూప్స్‌ డైరెక్టర్ల పై మరో సారి పిటిషన్‌….

హైదరాబాద్‌ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
* సుజనా గ్రూప్స్‌ రిట్‌ పిటిషన్స్‌……
*మరో సారి విచారణ….
నేడు (సోమవారం) హైకోర్టులో సుజనా గ్రూప్స్‌ రిట్‌ పిటిషన్స్‌ పై మరో సారి విచారణ జరగనుంది. జిఎస్‌టి కేసులను సవాల్‌ చేస్తూ సుజనా గ్రూప్స్‌ డైరెక్టర్స్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. జిఎస్‌టి కట్టినప్పటికీ.. నోటీసులు ఇచ్చారంటూ సుజనా గ్రూప్స్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంక్‌ రుణాలు పొందారని జిఎస్‌టి అధికారులు తెలిపారు. సుజనా గ్రూప్స్‌ డైరెక్టర్లను అరెస్ట్‌ చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశించింది. మరో సారి పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు విచారించనుంది.

No comments:

Post a Comment