Sunday, March 17, 2019

ప్రశాంతంగా ఫైర్‌మెన్‌ రాత పరీక్ష……

కర్నూలు  న్యూస్‌టుడే :
* 10,001 మందికిగాను 9,939 మంది హాజరుకాగా 62 మంది గైర్హాజరయ్యారు…
*పరీక్ష ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది… పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్‌మెన్‌ పోస్టుల నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ తుది అంకం పూర్తైంది.
ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు చివరిగా ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప పర్యవేక్షణలో కర్నూలు పరిధిలో 19 కేంద్రాల్లో పరీక్ష జరిపారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అభ్యర్థులను నిశితంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. బయోమెట్రిక్‌ ద్వారా అభ్యర్థులను నిర్ధరించుకున్నారు. 10,001 మందికిగాను 9,939 మంది హాజరుకాగా 62 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణలో జేఎన్‌టీయూ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు, సీఐలు సిబ్బంది పరీక్ష నిర్వహణలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment