Monday, March 18, 2019

ఒకేరోజు పలు చోట్ల నగదు పట్టివేత…..

కడప న్యూస్‌టుడే:
*పట్టుబడిన నగదును స్వాధినం చేసుకున్న పోలీసులు.
ప్రొద్దుటూరు పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన రెండు చెక్‌పోస్టుల వద్ద సోమవారం గ్రామీణ పోలీసులు రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ సీఐ భాస్కర్‌ గౌడ్‌ తెలిపారు. కొత్తపేట చెక్‌పోస్ట్‌ వద్ద రూ.2.50 లక్షల నగదును సీజ్‌ చేశామన్నారు. జమ్మలమడుగు నుంచి కడపకు వెళుతున్న విజయ్‌కుమార్‌ రూ.2.50 లక్షల నగదును ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకెళ్తుండగా ఆయన్ను విచారించి అదుపులోకి తీసుకుని సీజ్‌ చేసినట్లు వివరించారు. కొత్తపల్లి చెక్‌పోస్టు వద్ద మరో రూ.1.50 లక్షల నగదును మీనాపురానికి చెందిన భీముడు అనే వ్యక్తి తీసుకెళుతుండగా..దాన్ని కూడా పట్టుకుని సీజ్‌ చేశామన్నారు.

No comments:

Post a Comment