విశాఖ న్యూస్‌టుడే:
- ఘనంగా పైడిమాంబ తొలేళ్ల ఉత్సవం…
- నేడు ప్రధాన పండుగ…
కంచరపాలెం దరి ఆర్పీపేటలోని శ్రీ పైడిమాంబ అమ్మవారి తొలేళ్ల పండగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఎల్లమ్మతోటలోని అమ్మవారి ఆలయం నుంచి జగదాంబ, అల్లిపురం, జ్ఞానాపురం, కంచరపాలెం మీదుగా అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆర్పీపేటలోని పైడిమాంబ ఆలయం వద్ద ఉంచారు. మంగళవారం ప్రధాన పండగను నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఊరేగింపులో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఇతర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment