చత్తీస్‌గఢ్ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
* చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్డు ప్రమాదం..
* నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలు..
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నేషనల్ హైవే 30పైన కొండన్‌గావ్ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జిల్లా కలెక్టర్ సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.

No comments:
Post a Comment