అనంతపురంజిల్లా:గుంతకల్లు: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
* పోటీ చేయాలో లేదో ఆలోచిస్తా…
* నంతపురం లోక్‌సభ స్థానంలో ఓటమి తప్పదని జేసీ…
తెలుగుదేశం పార్టీ స్ర్కీనింగ్ కమిటీ పై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారను కానీ.. పోటీ చేయాలో లేదో ఆలోచిస్తానని అన్నారు. కమిటీ ఆలోచనలు స్పష్టంగా లేవని విమర్శించారు. కొంతమంది నాయకులపై అనుమానాలు ఉన్నాయని, కమిటీలో కొంతమంది మాటలు తనకు నచ్చలేదని అన్నారు. సింగమల, కళ్యాణదుర్గం, గుంతకల్లులో సిట్టింగులను మార్చాలని అన్నారు. సిట్టింగులను మార్చకుంటే అనంతపురం లోక్‌సభ స్థానంలో ఓటమి తప్పదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment