హైదరాబాద్ న్యూస్‌టుడే:
- రంజాన్ మాసం ఎన్నికలకు అడ్డుకాదు
- ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
నాలుగు మాసాల క్రితం జరిగిన శాసనసభ ఎన్ని కల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను దీవిస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలను తామే గెలుస్తామని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. సీ ఓటర్ సర్వేను టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన ట్విట్టర్‌లో ఆదివారం పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు అసద్ సోమవారం రీట్వీట్ చేస్తూ సీ ఓటర్ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 16 లోక్‌సభ స్థానాలు, ఆ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఒక స్థానం ఖాయమని వెల్లడించింది. టీఆర్‌ఎస్ విజయం సమాజంలో ప్రతి వర్గానికి విజయ సంకేతంగా నిలుస్తుందన్నారు. ఈ విజయంతో నిజమైన ఫెడరల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని అసదుద్దీన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment