మేదరమెట్ల న్యూస్‌టుడే:
ట్రాక్టర్ చోదకుని నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపింది. ఈ సంఘటన మద్దిపాడు మండలం గ్రోత్‌సెంటర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం కొలసనకోట గ్రామానికి చెందిన సీదర్ల సుబ్బారావు(65) ఒక ప్రైవేట్ కంపెనీలో కాపలాదారు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సోమవారం పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ సమయంలో గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న ట్రాక్టర్‌ను చోదకుడు పెట్రోలు బంకులో నుంచి నిర్లక్ష్యంగా వెనక్కి మళ్లించాడు. ఈసమయంలో వెనుకగా నడిచి వస్తున్న సుబ్బారావును ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని గుర్తించిన చోదకుడు ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment