Monday, March 11, 2019

సిక్కోలు నుంచి శ్రీకారం వరకు…..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే(అనంతపురం):
శాసనసభ నియోజకవర్గ స్థానాలకు కేటాయించే నెంబర్లు మారాయి.అప్పట్లో 120 క్రమ సంఖ్య ఉండగా నేడు ఒకటి నుంచి ప్రారంభమైంది.రాజకీయ పార్టీలు జిల్లాను సెంటిమెంటుగా భావించడం,అందులోనూ ఇచ్చాఫురం నుంచి ప్రారంభించడంతో అంతా శుభసూచికంగా భావిస్తుంటారు. దీంతో ఇక్కడ నుంచే ప్రారంభిస్తే బాగుంటుదనే సూచనలు, సలహాల మేరకు నిర్ణయించినట్టు చర్చ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమయ్యేది. అదే విధంగా రాష్ట్రం దేశంలో ఈశాన్య సరిహద్దులో ఉండడం, అందులో జిల్లా చివరగా ఉండడం, ఇచ్చాపురం నియోజకవర్గం కూడా ఈశాన్య ప్రాంతంతో ఉండడంతో ఇక్కడ నుంచే క్రమసంఖ్యలను కేటాయించినట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ స్థానాల వరుస సంఖ్య ఇచ్చాపురం 01తో ప్రారంభమై 10 వరకు నెంబర్లను కేటాయించారు.

No comments:

Post a Comment