Wednesday, March 20, 2019

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు……….

కర్నులు గోనెగండ్ల న్యూస్‌టుడే:
దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కోడుమూరు-ఎమ్మిగనూరు రహదారిలో నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా జేసీబీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా.. లింగందిన్నె వాసులే గోనెగండ్ల మండలం ఎస్‌.లింగందిన్నె గ్రామంలో నివాసముంటున్న అన్నదమ్ముల కుమారులైన వ్యక్తులు లక్ష్మీకాంతం, గోపాల్, రాముడు, రామాంజనేయులు కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై పుట్టపాశం వెళ్లారు. ఆ ఊరిలో గ్రామ దేవత ఉత్సవం జరుగుతుండడంతో మొక్కులు తీర్చుకుని బంధువుల ఇంట్లో సందడి చేశారు. భోజనాలు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి రాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో జేసీబీ ఢీకొనడంతో ఎగిరి పడ్డారు. తల, శరీరాలకు తీవ్ర గాయాలవడంతో లక్ష్మీకాంతం(30), గోపాల్‌(40), రాముడు(35) అక్కడికక్కడే మృతిచెందారు. రామాంజనేయులు(25)కు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదించారు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన సమీప బంధువులు కావడంతో వీరి స్వగ్రామం లింగందిన్నెలో విషాదం అలుముకుంది. గ్రామంలో నివాసముంటున్న శంకరయ్యకు లక్ష్మీకాంతం ఏకైక కుమారుడు. బండి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతనికి భార్య శివమణి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడంతో ఆ కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. మృతులంతా వ్యవసాయదారులే.  సీతారాముడి కుమారుడు గోపాల్‌ గౌండ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతడికి భార్య ఈరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ మొత్తం ఇతనిపైనే ఆధారం.

No comments:

Post a Comment