Wednesday, March 20, 2019

అమ్మేందుకు కాదు.. పంచేందుకు!……………

  నర్సీపట్నం న్యూస్‌టుడే: వరుసలో అమర్చిన ఈ టోపీలు, జెండాలు, కండువాలు చూస్తుంటే ఎన్నికల ప్రచార సామగ్రి అమ్మకం దుకాణంలా కనిపిస్తోంది కదూ. విషయం ఏమిటంటే ఈనెల 22న మంత్రి అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ ర్యాలీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నర్సీపట్నం వస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు. వారందరికీ అందజేయడానికి వీలుగా పంచాయతీల వారీగా ఈ సామగ్రిని నాయకులకు అందజేయడానికి వీలుగా ఇలా వరసలో పేర్చారు. బుధవారం నర్సీపట్నంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశానికి విచ్చేసిన నాయకులకు వీటిని అందజేశారు.

No comments:

Post a Comment