పొన్నాడ(ఎచ్చెర్ల),న్యూస్‌టుడే:
ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలో తెప్పరేవు సమీపంలో నాగావళి నదికి ఆనుకుని ఉన్న పొన్నాడ కొండపై నాలుగు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు బుధవారం జేసీ చక్రధర్‌బాబు, ఆర్డీవో ఎంవీ రమణలు స్థలాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్86 లో ఉన్న కొండ మొత్తం 58.80 ఎకరాల్లో ఉంది. దీనిలో నాలుగు ఎకరాల స్థలాన్ని రామకృష్ణ మఠానికి 99ఏళ్ల పాటు లీజుకిచ్చేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో స్థలం కేటాయించాలనేది మండల రెవెన్యూ అధికారులకు జేసీ సూచనలు చేశారు. ఈ కొండపై ఇప్పటికే ఇస్కాన్ సంస్థకు, అంబేడ్కర్ శిక్షణ సంస్థకు ఐదు ఎకరాల చొప్పున కేటాయించారు. వీటితోపాటు శిల్పారామానికి 9.75సెంట్లు స్థలాన్ని కేటాయించగా ఇప్పటికే ప్రహరీగోడ నిర్మాణం జరిగింది. ఇదే కొండపై నదికి ఆనుకుని నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించారు. ఏపీ పర్యాటక శాఖకు పర్యాటకంగా అభివృద్ధి కోసం 20ఎకరాలు కేటాయించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కూన వైకుంఠరావు, సర్వేయర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment