కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
* వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొయ్యలగూడెం రానున్నారు..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొయ్యలగూడెం రానున్నారు.
మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్ ద్వారా ఆయన కొయ్యలగూడెం సమీపంలోని ఆర్టిజన్ కాంప్లెక్సు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం గ్రామంలోని వినాయకుడి గుడి కూడలి వద్ద బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తరువాత తూర్పుగోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్తారని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి తెల్లం బాలరాజు సోమవారం తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

No comments:
Post a Comment