Thursday, March 14, 2019

పట్టుబడిన నగదును పరిశీలిస్తున్న అధికారులు…

ప్రకాశం న్యూస్‌టుడే: 
 ఎన్నికల నియమావళిని అనుసరించి చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంవద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు.ఇక్కడప్రత్యేకాధికారిగానియమితులైన చీమకుర్తి ఈవోఆర్డీ కె.కుసుమ కుమారి, ఎస్‌ఐ జీవీ.చౌదరి ఆధ్వర్యంలో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. పొదిలి వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న బావుటా కంపెనీ బీడీలకు చెందిన వాహనంలో తనిఖీలు చేశారు. ఈ సమయంలో సంచిలో ఉన్న నగదునుగుర్తించిస్వాధీనంచేసుకున్నారు. మొత్తం రూ.5,77,560గా లెక్క తేల్చారు. తాము బీడీ సంస్థలో పనిచేస్తున్నామని, ఉదయం ఆయా దుకాణాలకు బీడీలు వేసుకుంటూ వెళ్లి, సాయంత్రంనగదువసూలుచేసుకుంటూ ఒంగోలు వస్తున్నట్టు సూపర్‌వైజర్‌ షేక్‌ నాగూర్‌ వలి, డ్రైవర్‌ షేక్‌ జలీల్‌ తెలిపారు.నగదువసూళ్లకుసంబంధించిన రసీదులను చూపారు. ఇంతలో ఒంగోలు గ్రామీణ సీఐ దుర్గా ప్రసాద్‌ తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్నారు. బావుటా కంపెనీ ప్రతినిధులు వచ్చారు. తనిఖీల్లో పట్టుబడిన నగదును సీజ్‌ చేసి బిల్లులు పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సంబంధిత ధ్రువ పత్రాలు సమర్పిస్తే నగదును తిరిగి యజమానికిఅందజేస్తామని సీఐ తెలిపారు.

No comments:

Post a Comment