ప్రకాశం న్యూస్‌టుడే:
రసాయన పేలుడు కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గాంధీరోడ్డులోని భీమరాజువారి వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన నూకరాజు(40) అనే వ్యక్తి మృతి చెందారు. అతని భార్య తీవ్రంగా గాయపడ్డారుఈ క్రమంలో గురువారం స్థానికంగా నివసించే తాతా ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గదిని శుభ్రం చేసే పని చేస్తున్నారు. సదరు గదిలో ఉన్న రసాయనాల డబ్బాలను రిక్షాలో బయటికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నూకరాజు మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన రసాయనాలు ఏంటనే విషయంపై ఆరా తీస్తున్నారు. నూకరాజు మృతదేహాన్ని రిమ్స్ శవాగారానికి తరలించారు.
No comments:
Post a Comment