Thursday, March 14, 2019

శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి…?

  • శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక గల తలుపును తీసిపెట్టాలి.
  • వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముతైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి.
  • పసుపుకొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయని పురాణాల్లో వివరిచబడింది.
  • అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించాలి.
  • ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి.

No comments:

Post a Comment