Monday, March 11, 2019

అధికారులకు రాని జీతాలు….


కర్నూలు  న్యూస్‌టుడే:
జిల్లా విద్యాశాధికారి కార్యాలయంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడంతో మెడికల్‌ బిల్లుల విషయంలో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రామశేషయ్య, బి.సుధాకర్, ఆకెపోగు భాస్కర్, రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని బీటీఏ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేదని, ఈ విషయమై మెడికల్‌ బిల్లుల బోర్డును సంప్రదించగా డీఈవో కార్యాలయం నుంచి ఒక్క బిల్లు రాలేదని చెబుతున్నారన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment