Wednesday, March 6, 2019

విద్యుత్ అధికారులపై ప్రజల అగ్రహం….

విజయనగరం న్యూస్‌టుడే:

జిల్లాలోని రామభద్రపురం మండలం కొండ కెంగువ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గంలో విద్యుత్తు తీగలు కిందకి వేలాడుతున్నాయి.అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విద్యుత్ తీగల వల్ల ఇప్పటీకే పలు ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు అన్నారు.ఈ విద్యుత్ తీగల వల్ల జనవరి నెలలో గడ్డి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment