చిత్తూరు న్యూస్‌టుడే: కక్షిదారులకు సరళమైన పరిష్కారం ఇవ్వడమే లోక్‌అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. సులభతరంగా లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి ముందస్తుగానే బీమా కంపెనీల ప్రతినిధులు, బ్యాంకు, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. మోటారు ప్రమాద కేసుల విచారణ 3-4 ఏళ్లు పడుతుందని.. ఉభయ వర్గాలతో చర్చించి లోక్‌అదాలత్‌లో ఏడాదిలోపే కేసులను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ లోక్‌అదాలత్‌కు హాజరైన కక్షిదారులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని కోరారు.
No comments:
Post a Comment