గుంటూరుజిల్లా:తాడేపల్లి: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
*రోబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో నైపుణ్య శిక్షణ…
* శిక్షణ ఇచ్చేందుకు గత నవంబరులో ఒప్పందం….
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్ధులకు రోబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ప్రెసిడెంట్ వంగపండు వెంకట నాగరాజు, పలువురు ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీ్ఎస్ఎస్‌డీసీ, ఈసీఎం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు గత నవంబరులో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్ధులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి మేలో ప్రారంభమయ్యే శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు.
No comments:
Post a Comment