Thursday, March 21, 2019

అభ్యర్దుల నేర చరిత్ర ….


గ్రూప్స్ సిలబస్ …
ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశం ప్రకారం పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీ కి పోటీ చేయదలుచుకున్న అభ్యర్ధి తన నామినేషన్ పత్రంతో పాటు కింద సూచించిన సమాచారాన్ని జత చేయ్యాలి?
1. గతంలో ఏదేని నేరంలో దోషిగా లేదా నిర్దోషిగా రుజువు అయ్యిందా లేదా తొలగింపు జరిగిందా  ఈ అంశంలో అతడు /ఆమెకు జైలు శిక్ష లేదా జరిమానా విధించారా…
2. నామినేషన్ దాఖలుకు ఆరు నెలల ముందు అభ్యర్ధి పై రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడదగ్గి కేసు ఏదైనా పెండింగ్ లో ఉందా. అంటే ఆనేరానికి సంబంధించి కోర్టులో ఉన్న ఆరోపణలు ఏమిటి ,కోర్టు పరిగణ నలోకి తీసుకున్న దేమున్నది …
3.అభ్యర్ధి  మరియు తన భార్య / భర్త ఆదారపడిన వారి ఆస్తులు స్థిర  చర ఆస్తులు ,బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము తదితర వివరాలు…
4. తీర్చాల్చిన బాకీలు. ముఖ్యంగా ఏదేని ప్రభుత్వ అర్ధిక సంస్థ లేదా ప్రభుత్వానికి తీర్చాల్చిన రుణ వివరాలు….
5. అభ్యర్ధి విద్యార్హతలు ఈ అఫిడివిట్ లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిస్తే అది నేడు ఎన్నికల నేరంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి నేరానికి ఆరునెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు ….

No comments:

Post a Comment