చిత్తూరు న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*ప్లాస్టిక్ కవర్లపై ఇడ్లీలు తయారు చేసి విక్రయిస్తున్న హోటళ్లు.
*వీటి వాడకాన్ని తగ్గించాలని హోటళ్లకు ఆదేశం.
హోటళ్లల్లో లాభార్జన కోసం,ఇడ్లీలు త్వరితగతిన తయారవుతాయన్న ఉద్దేశంతో ప్లాస్టిక్ కవర్లపై ఇడ్లీలు తయారు చేసి విక్రయంచడం నేరమని జిల్లా సహాయ ఫుడ్ కంట్రోలర్ జి.ప్రభాకరావు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా హోటళ్ల యజమానులతో అధికారులు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లపైన ఇడ్లీలు ఉడికించడం వల్ల అందులోకి రసాయనిక పదార్థాలు నీళ్లలో కలసిపోయి ఆవిరి రూపంలో ఇడ్లీలకు చేరుతుందన్నారు.దీని వల్ల కడుపులోకి ప్లాస్టిక్ చేరుతుందని వెల్లడించారు.

No comments:
Post a Comment