Thursday, March 14, 2019

అక్రమ రవాణాకు అధిక మూల్యం………

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే :
  • ఇతరత్రా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న 55 వాహనాలను పట్టుకున్నారు…
  • విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ ప్రాంతీయ అధికారి శివకోటి బాబూరావు ఆధ్వర్యంలో ఆశాఖ అధికారులు వేర్వేరు చోట్ల అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు.
తుంగభద్ర చెక్‌పోస్టు సమీపంలో సహజ వనరులు ఓవర్‌లోడ్, ఇతరత్రా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న 55 వాహనాలను పట్టుకున్నారు. రవాణాశాఖకు అప్పగించగా రూ.3.20 లక్షల మేర జరిమానా విధించారు. బుధవారం ఉదయం కర్నూలు మండలం తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను నిడ్జూరు వద్ద విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.
                                                                                                                

No comments:

Post a Comment